5 September, 2026 | 6:25 AM

బిడ్డా పొంగులేటి.. జాగ్రత్తగా మాట్లాడు

05-09-2026 | 05:05am
  1. లేదంటే తాటతీస్తాం 
  2. తెలంగాణ కేసీఆర్ అడ్డా 
  3. బీఆర్‌ఎస్ కంటే ఎక్కువ పని చేస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా
  4. భూములను బ్లాక్ లిస్టులో పెట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు 
  5. వట్టినాగులపల్లిలో రెండు వేల కోట్ల ఆస్తి దోచుకునే ప్రయత్నం 
  6. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి 
  7. హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో బీఆర్‌ఎస్ సమరభేరి 

మహబూబాబాద్, సెప్టెంబర్ 4 (విజయక్రాంతి): ‘బిడ్డా పొంగులేటి.. నోరు అదుపులో పెట్టుకొని జాగ్రత్తగా మాట్లాడు. లేదంటే తాట తీస్తాం. తెలంగాణ గడ్డ కేసీఆర్(KCR) అడ్డా అనే విషయాన్ని మరవద్దు. బీఆర్‌ఎస్(BRS) కంటే మీరు ఎక్కువ పని చేసినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవి(MLA post)కి రాజీనామా చేస్తా’ అని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి(Padi Kaushik Redd) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. భూములను బ్లాక్ లిస్టు(blacklist)లో పెట్టి బ్లాక్ మెయిల్‌(blackmail)కు పాల్పడుతున్నారని, వట్టినాగులపల్లి(Vattinagulapalli) వద్ద 2 వేల కోట్ల రూపాయల విలువైన భూమిని పొంగులేటి కొట్టేయాలని చూస్తున్నారని ఆరోపించారు.

హనుమకొండ జిల్లా కమలాపూర్ మండల కేంద్రంలో బీఆర్‌ఎస్ కార్యకర్తల(BRS activists)తో కలిసి శుక్రవారం సమరభేరి కార్యక్రమంలో ర్యాలీ, వంట వార్పు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ.. మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి(Ponguleti Srinivasa Reddy)పై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ కంటే ఏ పని మీరు ఎక్కువ చేశారో నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించారు. తెలంగాణ గడ్డ.. కేసీఆర్ అడ్డా అని కౌశిక్ రెడ్డి స్పష్టం చేశారు.

వట్టినాగులపల్లిలో రూ.2 వేల కోట్ల భూమిని పొంగులేటి దోచుకోవాలని చూశారని ఆరోపించారు. రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కర్రకాల్చి వాత పెడతామన్నారు. కొడంగల్‌లో రేవంత్ రెడ్డి, పాలేరులో పొంగులేటి గెలవరని జోస్యం చెప్పారు. ఇద్దరు సింగిల్ డిపాజిట్‌కే పరిమితమని కౌశిక్ రెడ్డి ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో నెరవేరుస్తామన్న హామీలు వెయ్యి రోజులవుతున్నా ఆరు గ్యారంటీలు తీర్చలేదన్నారు.

‘నిన్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. మొన్న వచ్చి ఇండ్లు పంచి, ఇప్పటి వరకు లబ్ధిదారులకు ఇవ్వడం లేదు. మౌలిక వసతులు ఎందుకు కల్పించడం లేదు. హైదరాబాద్‌లో లక్ష ఎకరాలు బ్లాక్ లిస్ట్‌లో పెట్టి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు. వట్టినాగులపల్లి వద్ద రెండు వేల కోట్ల ఆస్తి దోచుకునే ప్రయత్నం చేసింది వాస్తవం కాదా’ అని ప్రశ్నించారు.

మాజీ మంత్రి కొండా సురేఖ బిడ్డనే మంత్రులు 30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని అన్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఈ విషయంపై విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కాగా, అసెంబ్లీలో దురుసుగా ప్రవర్తించినందుకు కౌశిక్ రెడ్డి లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని తెలంగాణ అసెంబ్లీ ఎథిక్స్ కమిటీ ఆదేశిస్తూ శుక్రవారం నాడు నోటీసులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

మరిన్ని వార్తలు