లారీ ఢీకొని వృద్ధురాలు మృతి

22-09-2026 | 10:33am

సదాశివనగర్, సెప్టెంబర్ 22: సదాశివనగర్ మండలం పద్మాజివాడి(Padmajivadi) చౌరస్తాలో మంగళవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) జరిగింది. కల్వరాల్ గ్రామానికి చెందిన మంగలి శివవ్వ (63) బస్సు ఎక్కేందుకు రోడ్డు దాటుతుండగా గాంధారి వైపు నుంచి వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో ఆమె అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం కామారెడ్డి ఏరియా ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు