నూతన కార్యవర్గ ఎన్నిక
23-09-2026 | 08:51pm
నేరడిగొండ సెప్టెంబర్ 23 (విజయక్రాంతి): పీ ఆర్ టీ యూ టీ ఎస్ నూతన కార్యవర్గాన్ని బుధవారం నేరడిగొండ మండల(Neradigonda Mandal) కేంద్రంలోని జడ్పి ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. అధ్యక్షులుగా బిక్కులాల్, ప్రధాన కార్యదర్శిగా తానాజి, అసోసియేషన్ అధ్యక్షులుగా రామకృష్ణ, సంతోష్ కుమార్, మహిళా అసోసియేషన్ అధ్యక్షులుగా మల్లేశ్వరి, మాయూరి, ఉపాధ్యక్షులుగా గంగాసింగ్, రాజేందర్, మహిళా ఉపాధ్యక్షురాలిగా సుగుణ, శారద, కార్యదర్శులుగా వెంకటరమణ, చంద్రశేఖర్, మహిళా కార్యదర్శులుగా సంగీత, కమలను ఎన్నుకున్నట్లు సంఘ సభ్యులు తెలిపారు.