ఎర్రవల్లిలో భూ సర్వే కొనసాగింపు.. 150 మంది రైతులకు నోటీసులు

22-09-2026 | 07:19am

హైదరాబాద్: ఎర్రవల్లి గ్రామంలోని 325 సర్వే నంబర్ పరిధిలో భూముల సర్వే(Land Survey) ప్రక్రియ కొనసాగుతోంది. గత ఐదు రోజులుగా రైతుల భూముల్లో అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. నేడు కూడా 325 సర్వే నంబర్‌లో భూ సర్వే కొనసాగనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ క్రమంలో ఇప్పటికే సుమారు 150 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. రైతుల భూముల హద్దులు, రికార్డులకు సంబంధించిన వివరాలను పరిశీలిస్తూ సర్వే నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. సర్వే ప్రక్రియపై రైతుల్లో ఆసక్తి నెలకొంది.

మరిన్ని వార్తలు