బాధిత కుటుంబాలకు పరామర్శ... ఓదార్పు...

04-10-2026 | 04:32pm

తాడ్వాయి,అక్టోబర్,04( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా(Kamareddy District) తాడ్వాయి మండలంలో ఇటీవల ప్రమాదవశాత్తు, అనారోగ్యంతో మృతి చెందిన కుటుంబ సభ్యుల కుటుంబాలను, గాయపడిన కుటుంబ సభ్యులను ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే జాజాల సురేందర్(Former Yellareddy MLA Jajala Surender) ఆదివారం పరామర్శించారు. మండలంలోని కాళోజి వాడిలో హాస్టల్ లో ప్రమాదవశాత్తు గాయపడిన గడ్డం హేమచంద్రిక పాపను అదే గ్రామంలో గుండెపోటుతో మృతి చెందిన శివలింగం కుటుంబ సభ్యులను కలిసి పరామర్శించి ఓదార్చారు.

ఏండ్రియాల, చందాపూర్ గ్రామాల్లో బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆయన ఓదార్చారు. బాధిత కుటుంబాలకు ధైర్యం చెప్పారు. పార్టీ అండగా ఉంటుందని కుటుంబ సభ్యులకు బరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు ముదాం నర్సింలు, తాడ్వాయి సింగిల్ విండో చైర్మన్ నల్లవెల్లి కపిల్ రెడ్డి, సర్పంచులు కొర్ని నర్సింలు, చంద్రారెడ్డి, మంగారెడ్డి,నాయకులు ప్రభాకర్ రెడ్డి,రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు