తాడువాయిలో విద్యార్థులకు కంటి పరీక్షలు
25-09-2026 | 03:26pm
తాడ్వాయి,సెప్టెంబర్,25( విజయ క్రాంతి ): కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని బాలికల గురుకుల పాఠశాలలో(Girls' boarding school) శుక్రవారం విద్యార్థులకు ఉచిత కంటి పరీక్షలు(Free eye check-ups) నిర్వహించారు.ఈ సందర్భంగా కంటి వైద్యులు రంజిత విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి మందులు అందించారు.
విద్యార్థుల ఎత్తు, బరువును పరీక్షించారు. లోపాలు ఉన్న విద్యార్థులను గుర్తించి వారికి మందులు అందించారు. ఈ కార్యక్రమంలో గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ సురేఖ, ఉపాధ్యాయులు స్రవంతి, అనూష తదితరులు పాల్గొన్నారు.