కాపురంలో కలహం
29-09-2026 | 11:41am
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా కేంద్రంలోని అశోక్ రోడ్డులో దారుణ ఘటన చోటుచేసుకుంది. యూట్యూబ్ ఛానల్ రిపోర్టర్‌గా పనిచేస్తున్న వైద్య మోహన్‌పై అతని భార్య జమున రోకలి బండతో దాడి చేయడంతో మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో అశోక్ రోడ్డులో తీవ్ర కలకలం నెలకొంది.
భార్య జమునపై అనుమానంతో భర్త మోహన్ వేధించేవాడని, ఈ క్రమంలోనే ఘటన జరిగినట్లు సమాచారం. అయితే హత్యకు దారితీసిన అసలు కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది. వీరికి నాలుగేళ్ల కుమార్తె ఉన్నట్లు తెలిసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.