భూ వివాదంలో పోలీసుల ఎంట్రీ...!

17-09-2026 | 04:33pm

- మనస్తాపంతో రైతు ఆత్మహత్యాయత్నం

- పరిస్థితి విషమం

నాగర్‌ కర్నూల్,(విజయక్రాంతి): బాట పంచాయతీలో పోలీసులు రంగ ప్రవేశం చేసి బలవంతంగా అక్రమంగా తన పొలం గుండా బాట ఏర్పాటు చేయడంతో ఓ దళిత రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన నాగర్‌ కర్నూల్ జిల్లా తిమ్మాజిపేట మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే గ్రామానికి చెందిన కృష్ణయ్య అనే రైతు తనకున్న రెండు ఎకరాల పొలంలో అక్రమంగా బాట ఇవ్వాలంటూ వందల ఎకరాలు ఉన్న భూ అసామి రాజకీయ, అధికార బలం ప్రదర్శించాడు.

కొద్ది రోజులుగా నెలకొన్న ఈ భూ వివాదంలో న్యాయం కోరిన బాధితుడి పైనే కేసులు నమోదు చేసి బలవంతంగా జెసిబిల సహాయంతో  పోలీసులు బాట ఏర్పాటు చేయడంతో మనస్థాపం చెందాడు. అక్కడే ఉన్న పురుగుల మందు సేకరించి ఆత్మహత్యాయత్నానికి ఒడిగట్టాడు. అయినా పోలీసు అధికారులు కూడా పట్టించుకోకపోవడంతో స్థానిక రైతులు గమనించి  జిల్లా జనరల్ ఆస్పత్రికి తరలించినట్లు ఆరోపించారు. ఈ విషయంలో అధికార ప్రతిపక్ష నేతలు కూడా అక్రమార్కులకు వంత పాడుతూ పోలీసులపై ఒత్తిడి చేయడం కోసమెరుపు.

మరిన్ని వార్తలు