సాగు గోషా... సర్కార్ తమాషా

02-10-2026 | 07:16pm
  1. రైతుల పంట పొలాలను పరిశీలించిన టిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు*
  2. - పంటలు ఎండిపోతున్న పట్టించుకోని ఈ రాష్ట్ర ప్రభుత్వం
  3. - లిఫ్ట్ మోటార్లను రిపేర్ చేయించకపోవడంతో దాదాపు 80 ఎకరాలు వరి పంట ఎండిపోయింది
  4. - ఎండిపోయిన వరి పంటకు నిప్పు పెట్టుకున్న రైతు

బోధన్ అక్టోబర్ 02 (విజయక్రాంతి): నిజామాబాద్ జిల్లా నవీపేట్ మండలం(Navipet mandal) నిజాంపూర్ గోదావరి ఒడ్డున ఎత్తిపోతల పథకం ఉంది.ఈ ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 1600 ఎకరాల పంట భూమికి నీరు అందించడం జరుగుతుంది. ఏదైతే గత రెండు నెలల కింద ఈ లిఫ్టును ప్రారంభించి రైతులకు నీరు అందించడం జరిగింది దాదాపు 20 రోజుల కింద ఈ లిఫ్ట్ యొక్క రెండు మోటార్లు,

పూర్తిగా చెడిపోవడం జరిగింది ఏదైతే 20 రోజుల కింద మొరాయించినా ఈ మోటార్లను ఇప్పటివరకు రిపేర్ చేయించే నాథుడే కరువయ్యాడు,ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించిన పట్టించుకోవడం లేదు దాదాపు ఈ లిఫ్ట్ కింద నీరు అందక పోవడంతో సుమారు 80 ఎకరాల పంట పూర్తిగా ఎండిపోవడం జరిగింది.రైతు ఎకరానికి 30 వేయి ఖర్చు పెట్టి ఈ స్థాయి వరకు వరి పంటను తీసుకొస్తే గోదావరి నదిలో నీరు ఉండి కూడా మోటార్లను బాగు చేయించలేక తమ వరి పంటను ఎండగొట్టారని చెప్పేసి లింగాపూర్ గ్రామానికి చెందిన రైతు గణేష్  నిన్నటి రోజున బాధతో కన్నీరు మున్నీరవుతు తన వరి పంటకు నిప్పు పెట్టుకోవడం జరిగింది . ఈ విషయం తెలుసుకొని మా తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కల్వకుంట్ల కవిత  వెంటనే స్పందించి జిల్లా నాయకులను తక్షణమే మీరు రైతుల దగ్గరికి వెళ్లి రైతుకు మనోధైర్యాన్ని నివ్వాలని ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించి ప్రభుత్వానికి మరియు జిల్లా కలెక్టర్ కు దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా ఉండాలన్నారు,ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు నవీన్ రెడ్డి  మాట్లాడుతూ ...

చేతికి వచ్చిన పంట కు నీరు ఇవ్వలేని పరిస్థితి ఈ రాష్ట ప్రభుత్వం ఉంది,బోధన్ ఏమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారి పక్క గ్రామం లోనే ఇలా పంటలు ఎండిపోవడం సిగ్గు చేటు,రైతులకు న్యాయం చేయలేని మీరు పదవిలో ఉండి లేనట్లే అని ,నష్ట పోయిన పోయిన పంటల పైన బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారు వెంటనే స్పందించి మోటార్ల ని రిపేర్ చేయించి రైతులను ఆదుకోవాలని ,నష్ట పోయిన పంటకు వెంటనే నష్ట పరిహారం కూడా అందించాలని లేని యెడల నష్ట పోయిన రైతులతో ఇంటిని ఏమ్మెల్యే గారి ఇంటిని ,జిల్లా కలెక్టరేట్ కూడా ముట్టడిస్తామని అన్నారు.

ఈ కార్యక్రమం లో జిల్లా అధ్యక్షుడు ఏలేటి నవీన్ రెడ్డి ,ప్రధాన కార్యదర్శి దొంత ప్రవీణ్ ,సొసైటీ చైర్మన్ మగ్గరి హన్మండ్లు,టౌన్ ప్రెసిడెంట్ యెండల ప్రసాద్ జిల్లా నాయకులు కరిపే గంగాధర్,షాన్వాజ్ జనార్దన్,దినేష్ ,సంతోష్,రాఘవేందర్,జాదవ్,కృష్ణ ,ఆశిష్,నరహరి,భూమయ్య,మహిళా నాయకులు సరిత,రేఖ ,శోభ ,ప్రమీల రైతులు కల్లెం బాబన్న,గణేష్,సాయిలు,రాజు,ఒడ్డున ,ధర్మన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు