6 September, 2026 | 4:22 PM

రైతులకు కోతలు లేని 24 గంటల విద్యుత్ అందించాలి

06-09-2026 | 02:44pm

బిఆర్ఎస్ సమరభేరిలో నాయకుల ధర్నా

నేరేడుచర్ల సెప్టెంబర్ 06(విజయ క్రాంతి): రైతులకు కోతలు లేని 24 గంటల విద్యుత్(Electricity) అందించాలని బిఆర్ఎస్ (BRS)పార్టీ సమరభేరిలో భాగంగా ఆదివారం నాడు నేరేడుచర్ల మండల పరిధిలోని దిర్శించర్ల సబ్‌స్టేషన్(Substation) వద్ద బిఆర్ఎస్ మండల, పట్టణ నాయకులు ధర్నా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నేరేడుచర్ల బిఆర్ఎస్ మండల పార్టీ మాజీ అధ్యక్షులు అరిబండి సురేష్ బాబు, డీసీసీబీ మాజీ డైరెక్టర్, 3వ వార్డు కౌన్సిలర్ దొండపాటి అప్పిరెడ్డి, సీనియర్ నాయకులు మాజీ ఎంపీపీ చెన్నబోయిన సైదులు, సీనియర్ నాయకులు మాజీ జడ్పీటీసీ అన్నపురెడ్డి నారాయణ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ చందమల్ల జయబాబు, మాజీ మండల పార్టీ ప్రధాన కార్యదర్శి యల్లబోయిన లింగయ్య యాదవ్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్లు నాగండ్ల శ్రీధర్,

ఇంజమూరి యశోద రాములు, మండల పార్టీ మాజీ ఉపాధ్యక్షులు వస్కుల సుదర్శన్, సీనియర్ నాయకులు ఇనుపాల పిచ్చిరెడ్డి, నేరేడుచర్ల గ్రంధాలయ మాజీ ఛైర్మన్ గుర్రం మార్కండేయ, మాజీ సర్పంచ్ పల్లెపంగు నాగరాజు, ఇంజమూరి, చిట్యాల శ్రీనివాస్, దిర్శించర్ల బిఆర్ఎస్ నాయకులు పార్ధనబోయిన నాగరాజు, పత్తేపురం వెంకటేశ్వర్లు, రాంబాబు, అనిల్, నరేష్, శ్రీను, సోమేశ్వరరావు, చిన సైదులు, వసంత రెడ్డి, రామయ్య, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు