రైతులు వీవిల్స్ ఉనికిని క్రమం తప్పకుండా పరిశీలించాలి
జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ సూచన
పెద్దపల్లి, ఆగస్టు 27 (విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లాలో ఆయిల్పామ్ సాగు విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో రైతు లు శాస్త్రీయ యాజమాన్య పద్ధతులను పా టిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ తెలిపారు.
ముఖ్యంగా ఆయిల్పామ్ తోటల్లో సమర్థవంతమైన పరాగసం పర్కం జరగడంలో వీవిల్స్ కీలక పాత్ర పోషిస్తాయని, రైతులు వాటి ఉనికి, కార్యకలా పాలను నిరంతరం పరిశీలించాలని సూచించారు. ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ గ్రా మంలో నిర్వహించిన ఆయిల్పామ్ పరాగసంపర్క వీవిల్స్ విడుదల కార్యక్రమంలో గడ్డం శ్యామ్ ప్రసాద్ పాల్గొని రైతులకు వీవి ల్స్ ప్రాధాన్యతపై అవగాహన కల్పించారు.ఆయిల్పామ్ పంటలో సహజ పరాగసంపర్కం ప్రధానంగా వీవిల్స్ ద్వారానే సమర్థవంతంగా జరుగుతుందని ఆయన తెలిపారు.
గాలి ద్వారా పరాగసంపర్కం పరిమి తంగానే ఉండగా, వీవిల్స్ ఒక పుష్పం నుంచి మరో పుష్పానికి పరాగాన్ని చేరవేయడం ద్వారా అధిక స్థాయిలో పరాగసంపర్కం జరి గి పండ్ల గెలల్లో కాయల ఏర్పాటుకు, దిగుబడి పెరుగుదలకు దోహదపడుతుందని వివరించారు.రైతులు తమ ఆయిల్పామ్ తోటల్లో వీవిల్స్ సంఖ్యను, వాటి కార్యకలాపాలను ఎప్పటికప్పుడు పరిశీలించాలని సూ చించారు. పరాగసంపర్కం సక్రమంగా జరగకపోవడం, పండ్ల గెలల్లో కాయల సంఖ్య తగ్గడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే సంబంధిత ఉద్యానశాఖ అధికారులను సం ప్రదించి అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు.
అధిక దిగుబడుల కోసం సమతుల్య ఎరువుల వినియోగం, తగిన నీటి సరఫరా, డ్రిప్ సేద్యం, కలుపు నివారణ, పుష్పించే దశలో ప్రత్యేక యాజమాన్యం, పురుగుతెగుళ్ల పర్యవేక్షణతో పాటు సమర్థవం తమైన పరాగసంపర్కం కూడా అత్యంత ము ఖ్యమని గడ్డం శ్యామ్ ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లాలో రైతులు ఆయిల్పామ్ తోటలను శాస్త్రీయ పద్ధతుల్లో నిర్వహిస్తూ మెరు గైన దిగుబడులు సాధిస్తున్నారని తెలిపారు. భవిష్యత్తులో కూడా రైతులకు ఉద్యానశాఖ తరఫున అవసరమైన సాంకేతిక సూచనలు, అవగాహన కార్యక్రమాలు అందించి ఆయిల్పామ్ సాగును మరింత అభివృద్ధి చేస్తా మని ఆయన చెప్పారు.వీవిల్స్ లభ్యత, పు ష్పించే పరిస్థితి, పరాగసంపర్కం, పండ్ల గెలల్లో ఫ్రూట్సెట్ను రైతులు క్రమం తప్పకుండా పరిశీలిస్తేనే అధిక దిగుబడులు సాధించడం సాధ్యమవుతుందని జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ అధికారి గడ్డం శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేశారు.






