ఏఐకి భయపడొద్దు

25-10-2026 | 05:20am
  1. అవకాశాలను అందిపుచ్చుకోండి
  2. యువతలో భయాలు కాదు, భరోసా నింపాలి
  3. హైదరాబాద్‌ను గ్లోబల్ ఏఐ హబ్‌గా తీర్చిదిద్దాలి
  4. పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించాలి
  5. రాండమ్ ట్రీస్  ప్రారంభోత్సవంలో కేటీఆర్

హైదరాబాద్, అక్టోబర్ 24 (విజయక్రాం తి): ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ)ను(Artificial Intelligence) ఉద్యోగాలను హరించే భూతంలా కాకుండా, కొత్త అవకాశాలను సృష్టించే సాంకేతిక పరిజ్ఞానంగా చూడాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రె సిడెంట్ కేటీఆర్(BRS Working President KTR) యువతకు సూచించారు. మారుతున్న సాంకేతికతకు అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకుంటూ, కొత్త ఆవిష్కరణలకు సిద్ధం కావాలని చెప్పారు.

శనివారం హైదరాబాద్‌లో డేటా, ఏఐ, ఇ న్నోవేషన్ రంగాల్లో పనిచేస్తున్న రాండమ్ ట్రీస్ సంస్థ భారతదేశ ప్రధాన కార్యాలయా న్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భం గా ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి, పెట్టుబడుల ఆకర్షణ, యువతకు ఉపాధి అవకా శాలు, భవిష్యత్తు సాంకేతిక పరిణామాలపై ఆయన మాట్లాడారు. ప్రతి సాంకేతిక విప్ల వం తొలుత కొన్ని భయాలను, సందేహాల ను సృష్టిస్తుందని, గతంలో బ్యాంకింగ్ రం గంలో కంప్యూటర్ల ప్రవేశాన్ని వ్యతిరేకించిన విషయాన్ని గుర్తుచేశారు.

మార్పులను అడ్డుకోవడం కంటే వాటికి అనుగుణంగా మార డమే అభివృద్ధికి మార్గమని తెలిపారు. ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయనే ఆందోళన తో ఆగిపోకుండా, దానిని ఎలా ఉపయోగించుకోవాలి, ప్రపంచ పోటీలో ఎలా ముందు ండాలి అనే అంశాలపై యువత దృష్టి సా రించాలని సూచించారు. అవసరమైనప్పుడు పాత పద్ధతులను వదిలి కొత్త విధానాలను స్వీకరించడం నేటి ఉద్యోగ ప్రపంచంలో కీలకమని చెప్పారు.

ప్రభుత్వాలు అందరికీ ఉ ద్యోగాలు కల్పించడం సాధ్యం కాదని, ప్రైవే ట్ రంగం అభివృద్ధి చెందేలా అవసరమైన పరిస్థితులను సృష్టించడం ముఖ్యమన్నారు. పెట్టుబడులు పెట్టే సంస్థలకు అనవసరమైన అడ్డంకులు లేకుండా చూడటం, మంచి రహదారులు, నిరంతర విద్యుత్, నీటి సరఫరా, మెరుగైన రవాణా, శాంతిభద్రతలు, నాణ్యమైన మౌలిక సదుపాయాలు పెట్టుబడుల ను ఆకర్షించడంలో కీలకమని పేర్కొన్నారు. 

హైదరాబాద్ ఐటీ ప్రగతికి గత ప్రభుత్వంలో కృషి

గత పదేళ్లలో తెలంగాణలో ఐటీ రం గం అభివృద్ధికి, హైదరాబాద్‌ను అంతర్జాతీయ సంస్థలకు ఆకర్షణీయమైన గమ్య స్థానంగా మార్చేందుకు తమ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేసిందని కేటీఆర్ పే ర్కొన్నారు. గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు(జీసీసీ), అంతర్జాతీయ పెట్టుబడులు, సాంకే తిక సంస్థలు, నైపుణ్యం కలిగిన మానవ వ నరుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు.

హైదరాబాద్ కేవలం ఐటీ సేవలకే పరిమితం కాకుండా, ఏఐ పరిశోధన, డేటా సైన్స్, ఉత్పత్తుల అభివృద్ధి, సాంకేతిక ఆవిష్కరణలకు కూడా ప్రధాన కేంద్ర ంగా ఎదగాలని ఆకాంక్షించారు. రాండమ్ ట్రీస్ వంటి సంస్థలు నగరంలోకార ్యకలాపాలను విస్తరించడం ద్వారా సాంకేతిక రంగానికి, ఉపాధి అవకాశాలకు మరింత ఊతం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశా రు.

ప్రభుత్వాలు, పరిశ్రమలు, విద్యాసంస్థలు సమన్వయంతో పనిచేస్తూ యువతకు పరిశ్రమ అవసరాలకు అనుగుణమైన నైపుణ్యాలను అందించాలని సూచించారు. పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా తెలంగాణ సాంకేతిక ప్రగతిని మరింత ముందుకు తీసుకెళ్లవచ్చని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు