నూతన ఆత్మ కమిటీ సభ్యులకు సన్మానం
17-09-2026 | 10:11pm
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి),సెప్టెంబర్ 17: తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samelu) సూచనలు, ఆదేశాల మేరకు మండల కేంద్రం అర్వపల్లిలోని మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో గురువారం నూతనంగా నియమితులైన బ్లాక్ ఫార్మర్స్ అడ్వైజరీ కమిటీ (బీఎఫ్ఏసీ)మరియు వ్యవసాయ సాంకేతిక రైతుల సలహా యాజమాన్య కమిటీ (ఆత్మ)సభ్యుల సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా బీఎఫ్ఏసీ సభ్యులు నర్సింగ వెంకటేశ్వర్లు గౌడ్,వజ్జె వీరయ్య, మారం కోటిరెడ్డిలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు గుడిపల్లి మధుకర్ రెడ్డి శాలువాలతో ఘనంగా సన్మానించి మాట్లాడారు.