ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

24-09-2026 | 09:38pm

దండేపల్లి, (విజయక్రాంతి) : మంచిర్యాల జిల్లా దండేపల్లి ఉన్నత పాఠశాల(Dandepalli High School) భౌతికశాస్త్ర ఉపాధ్యాయులు అప్పాల మనోహర్ జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయునిగా ఎన్నికైన సందర్భంగా గురు వారం ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్ బొజ్జ శోభ, అధ్యాపక బృందం శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు సంఘర్ష్ రాజేశ్వరరావు, జూనియర్ కళాశాల అధ్యాపకులు నగేష్, వెంకటస్వామి, శ్రీనివాస్, శేఖర్, విజయలక్ష్మి, పాఠశాల ఉపాధ్యాయులు శ్రీనివాస్, రవీందర్, రమేష్, తిరుపతి, లచ్చన్న, ఫ్రాన్సిస్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు