భూత్పూర్ లో మాజీ ఎమ్మెల్యే ఆల జన్మదిన వేడుకలు
భూత్పూర్, సెప్టెంబర్ 30 :భూత్పూర్ మండల కేంద్రంలోని చౌరస్తాలో బిఆర్ఎస్ పార్టీ దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి(Former MLA Ala Venkateswar Reddy) జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్ గౌడ్ ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన కేకును కట్ చేసి కార్యకర్తలకు, నాయకులకు తినిపించి సంబరాలు చేసుకున్నారు.
మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి జన్మదిన వేడుకలు జరుపుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమం, పండ్ల పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, చంద్రశేఖర్ గౌడ్, నారాయణ గౌడ్, సత్యనారాయణ, గోపులాపూర్ సత్యనారాయణ, తూము శ్రీనివాస్ రెడ్డి, అశోక్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచులు ఆల శ్రీకాంత్ రెడ్డి, సురేష్ తో పాటు టౌన్ అధ్యక్షుడు సురేష్ గౌడ్ తో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.