శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే
నాగిరెడ్డిపేట్,సెప్టెంబర్ 22 (విజయక్రాంతి):మండలంలోని గోపాల్పేట్ శ్రీ సాయినాథ్ యూత్ గణేష్ మండలి ఆధ్వర్యంలో వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన శివపార్వతుల కల్యాణ మహోత్సవంలో ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ (Former MLA of Yella Reddy, Nallamadugu Surender)పాల్గొన్నారు.అనంతరం వినాయకుడికి మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు.నాగిరెడ్డిపేట్ మండలంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలనన్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే నల్లమడుగు సురేందర్ మాట్లాడుతూ...వినాయక ఉత్సవాలు భక్తి, ఆధ్యాత్మికతతో పాటు ప్రజల్లో ఐక్యత, సేవాభావాన్ని పెంపొందించేందుకు దోహదపడతాయని అన్నారు.ఉత్సవాలను ప్రజలంతా భక్తిశ్రద్ధలతో నిర్వహించాలని కోరారు.
కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గుర్రాల సిద్దయ్య,మండల ప్రధాన కార్యదర్శి మంగలి యాదగిరి,గోపాల్పేట్ సర్పంచ్ వంశీకృష్ణ గౌడ్, నాయకులు మోతే శ్రీనివాస్, గొల్లపల్లి నారాయణ, పరిశోధన్ రెడ్డి, విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు.