అంత్యక్రియలకు వెళ్తూ.. అనంత లోకాలకు

04-10-2026 | 05:30am
  1. అనంతగిరి ఘాట్ రోడ్డులో బస్సు బోల్తా
  2. నలుగురు మహిళలు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం
  3. పదిమందికి తీవ్ర గాయాలు
  4. బస్సు బ్రేకులు ఫెయిలై ప్రమాదం
  5. పటాన్‌చెరు నుంచి ప్రైవేటు ట్రావెల్స్ బస్సులో వెళ్తుండగా ఘటన
  6. ఆ సమయంలో బస్సులో 51 మంది ప్రయాణికులు 
  7. క్షతగాత్రులకు మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ
  8. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్‌‌‌రరగేషియా ప్రకటించిన మంత్రి 
  9. దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్

వికారాబాద్, అక్టోబర్- 3 (విజయక్రాంతి)/పటాన్‌చెరు: వికారాబాద్ జిల్లా కేంద్ర సమీపంలోని అనంతగిరి ఘాట్ రోడ్‌లో(Ananthagiri Ghat Road) శనివారం ఉదయం ఘోర బస్సు ప్రమాదం(Bus accident) చోటుచేసుకుంది. బంధువు అంత్యక్రియల కోసం ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సులో 51 మం ది సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు నుంచి బయలుదేరి అనంతగిరి చివరి ఘాట్ రోడ్డుకు చేరుకున్న తర్వాత ఒక్కసారిగా బస్సు బ్రేకు లు ఫెయిల్ కావడంతో బోల్తా  కొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు మహిళలు ప్రాణా లు కోల్పోగా, పదిమంది తీవ్రంగా గాయపడ్డారు. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలిసింది. వికారాబాద్ జిల్లా ధరూరు మం డలం చింతకుంట గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తన భార్యతో కలిసి పటాన్‌చెరు సమీపంలోని కేసారం గ్రామంలో అత్తగారింటి వద్ద చాలాకాలంగా నివాసం ఉంటు న్నాడు. కుటుంబ కలహాలతో నారాయణరెడ్డి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నట్లు స మాచారం.

అయితే అతని అంత్యక్రియలను స్వగ్రామమైన చింతకుంటలో నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకొచ్చారు. శనివారం ఉద యం అంత్యక్రియలు ఉండటంతో కేసారం గ్రామానికి చెందిన నారాయణరెడ్డి భార్య తరఫు బంధువులందరూ ఓ ప్రైవేటు ట్రావె ల్ బస్సు అద్దెకు తీసుకున్నారు. మొత్తం 51 మంది చింతకుంటకు బయలుదేరారు. అనంతగిరి చివరి ఘాట్ రోడ్డులోకి రాగానే బస్సు బ్రేకు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది.

ప్రమాదంలో నలుగు రు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. వారిలో అత్వేలి యాదమ్మ(55), అత్వేలి పద్మమ్మ(52), బీరంగూడ పద్మమ్మ(50), ఆర్ ప్రమీల(50) ఉన్నారు. మరో 10 మంది కి తీవ్ర గాయాలు అయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. వారిని మెరుగైన చికిత్స కోసం వికారాబాద్ లోని ఆయా ప్రభుత్వ, ఆసుపత్రులతో పా టు హైదరాబాద్‌కు తరలించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే ఘటన స్థలానికి జిల్లా కలెక్టర్ దీపక్ తివారి, ఎస్పీ స్నేహ మెహర చేరుకొని క్షతగాత్రులను వెంటనే ఆసుపత్రికి తరలించారు. వికారాబాద్ డీఎస్పి అంజయ్య, వికారాబాద్, దారుర్ సీఐలు రఘుకుమార్, రఘు రాం బస్సులో చిక్కుకున్న వారిని బయటికి తీసేందుకు తీవ్రంగా శ్రమించారు. స్థానికులు సైతం పెద్ద ఎత్తున చేరుకొని ప్రమా దంలో ఉన్న వారిని బయటికి తీసేందుకు సహాయపడ్డారు. బోల్తా పడిన ట్రావెల్ బ స్సును జేసీబీ సహాయంతో పక్కకు నెట్టారు.

ఇద్దరు భార్యలు మృతి, భర్తకు తీవ్ర గాయాలు

ఈ ప్రమాదంలో అనంత్‌రెడ్డి అనే వ్యక్తి తీవ్ర గాయాలతో బయటపడగా అతని ఇద్ద రు భార్యలైన అత్వేలి యాదమ్మ, అత్వేలి ప ద్మమ్మ మృతిచెందారు. అనంత్ రెడ్డికి కుడి చేయి విరగగా మెరుగైన చికిత్స కోసం కుటు ంబీకులు ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు.

స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ దిగ్భ్రాంతి

బస్సు ప్రమాదంపై అసెంబ్లీ స్పీకర్, వికారాబాద్ ఎమ్మెల్యే గడ్డం ప్రసాద్ కుమార్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యూరప్ పర్యటనలో ఉన్న ఆయనకు విషయం తెలియగానే వెంటనే స్పందించి క్షతగాత్రులకు మెరుగైన సేవలు అందించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.  

క్షతగాత్రులకు మంత్రి శ్రీధర్‌బాబు పరామర్శ

మృతుల కుటుంబాలను వికారాబా ద్ జిల్లా ఆస్పత్రిలో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పరామర్శించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించారు. బస్సు ప్ర మాదంలో నలుగురు మరణించడం బాధాకరం అని అన్నారు.

మృతుల కు టుంబాలకు సీఎం ఆదేశాల మేరకు రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేసియా, క్షతగాత్రులకు లక్ష రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేసియాను అందచేయనున్నట్లు తెలిపారు. అనంతరం ప్రైవేటు ఆసుపత్రులలో చికిత్స పొందుతున్న క్షతగా త్రులను మంత్రి పరామర్శించి, మెరుగైన చికిత్స అందించాలని డాక్టర్లకు సూచించారు. 

మరిన్ని వార్తలు