రామచంద్రాపురంలో మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు
శిబిరాన్ని ప్రారంభించిన ఎంపీ రఘునందన్‌రావు
రామచంద్రాపురం: సేవా సంకల్ప్ అభియాన్(Seva Sankalp Abhiyan) కార్యక్రమంలో భాగంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్‌రావు(Madhavaneni Raghunandan Rao) ఆధ్వర్యంలో రామచంద్రాపురం డివిజన్ పరిధిలో మహిళలకు ఉచిత క్యాన్సర్ పరీక్షలు నిర్వహించారు.రామచంద్రపురం ప్రైమరీ హెల్త్ సెంటర్ ఆవరణలో శిశిర ఆసుపత్రి, శ్రేష్ఠ్ ఆసుపత్రుల సహకారంతో ఈ వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాధవనేని రఘునందన్‌రావు శిబిరాన్ని ప్రారంభించి, మహిళలకు నిర్వహిస్తున్న ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలను పరిశీలించారు.
క్యాన్సర్‌ను ప్రారంభ దశలోనే గుర్తించి సకాలంలో చికిత్స అందించేందుకు ఇటువంటి వైద్య శిబిరాలు దోహదపడతాయని తెలిపారు. మహిళలు ఆరోగ్యంపై నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి,డివిజన్ అధ్యాక్షులు నర్సింగ్ గౌడ్, డాక్టర్లు శ్రవణ్, సింధూ మాధవనేని, అర్వింద్, స్పందన నల్లగండ్ల తదితరులు పాల్గొన్నారు. మహిళలు పెద్ద సంఖ్యలో శిబిరానికి హాజరై ఉచిత క్యాన్సర్ పరీక్షలు చేయించుకున్నారు.