సత్యం..అహింసకు గాంధీజీ ప్రతీక..

02-10-2026 | 01:47pm
  1. హింసాత్మక భావజాలానికి వ్యతిరేకంగా పోరాడాలి...
  2. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్...

ఉట్నూర్, అక్టోబర్02 ( విజయ క్రాంతి): జాతిపిత మహాత్మా గాంధీ  జయంతి సందర్భంగా ఉట్నూర్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మహాత్మా గాంధీ  చిత్రపటానికి ఖానాపూర్ ఎమ్మెల్యే, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు వెడ్మ బొజ్జు పటేల్(Khanapur MLA Vedma Bojju Patel) పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సదుద్దేశంతో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా గాంధీ జయంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు.

మహాత్మా గాంధీ సత్యం, అహింస, శాంతి, ప్రజాస్వామ్య విలువలకు ప్రతీకగా నిలిచారని అన్నారు. గాంధీజీ చూపిన మార్గం దేశ ప్రజలకు ఎప్పటికీ మార్గదర్శకంగా ఉంటుందని పేర్కొన్నారు.బీజేపీ కేంద్ర నాయకత్వం గాంధీజీ సిద్ధాంతాలకు విరుద్ధంగా వ్యవహరిస్తోందని ఎమ్మెల్యే  విమర్శించారు. గాంధీజీని హత్య చేసిన నాథూరామ్ గాడ్సే భావజాలాన్ని ప్రోత్సహించే విధంగా బీజేపీ వ్యవహరిస్తోందని ఆరోపించారు.

గాంధీజీ ఆశయాలను కాపాడుతూ, ప్రజాస్వామ్యాన్ని మరియు రాజ్యాంగ విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు