సంతకు తీరింది చింత

06-10-2026 | 05:25am

* శరవేగంగా సమీకృత మార్కెట్ నిర్మాణం

* రూ.15 లక్షల వ్యయంతో తుదిదశకు పనులు

గంభీరావుపేట, అక్టోబర్ 5 (విజయక్రాంతి ): గంభీరావుపేట మండల(Gambhiraopet Mandal) కేంద్రంలో రోడ్డుపై నిర్వహించే సంతకు ఇక చింత తీరనుంది. రూ.15 లక్షల వ్యయంతో సమీకృత మార్కెట్ నిర్మాణం పనులు(Market construction works) శరవేగంగా కొనసాగుతున్నాయి. ఏళ్ల నుండి రోడ్డుపై సంత ఉండడంతో క్రయవిక్రయదారులు ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యేవారు. ఎండకు ఎండుతూ వానకు నానుతూ చలి తీవ్రతో కూడా ప్రతినిత్యం వందలాది మంది రైతులు కూరగాయలు(Farmers and vegetables) అమ్ముకొనుటకు చాలా ఇబ్బందులు పడేవారు.

మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ మల్లు గారి పద్మ -నర్సాగౌడ్ పర్యవేక్షణలో సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. ఆధునిక అంగులతో అన్ని సౌకర్యాలు ఒకే చోట ఉండే విధంగా మార్కెట్ నిర్మాణం చేపట్టడంతో మండల కేంద్రానికి వచ్చే ప్రజలకు ఇబ్బందులు తీరానున్నాయి.

తొందరలోనే అందుబాటులోకి తెస్తాం

 కూరగాయల క్రయ విక్రయదారులకు ఇబ్బందులు తొలిగేవిధంగా ఆధునిక హంగులతో అన్ని సౌకర్యాలు ఒకే చోట విధంగా మార్కెట్ నిర్మాణం చేపడుతున్నాం. నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. తొందరలోనే రోడ్డుపై నిర్వహించే సంతకు ఇబ్బందులు తీరనున్నాయి.

 మల్లు గారి పద్మ, సర్పంచ్,

గంభీరావుపేట

మరిన్ని వార్తలు