తూప్రాన్ పట్టణంలో గాంధీ జయంతి వేడుకలు
తూప్రాన్, అక్టోబర్ 2, (విజయక్రాంతి): తూప్రాన్ మున్సిపల్ పట్టణ కేంద్రంలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను తూప్రాన్ మున్సిపల్ కాంగ్రెస్ అధ్యక్షులు గరిగే నర్సింగరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మెదక్ జిల్లా(Medak District) కాంగ్రెస్ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, రాష్ట్ర నాయకులు చిట్కుల మహిపాల్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత భాస్కర్ రెడ్డిలు విచ్చేసి మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం మహాత్ముని యొక్క జ్ఞాపకాలను స్మరించుకున్నారు.
అనంతరం ఒకరినొకరు శాలువాలతో ఘనంగా సత్కరించుకున్నారు ఇందులో తూప్రాన్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, మనోహరాబాద్ మండలాధ్యక్షులు మల్లారెడ్డి, శషి భూషణ్ రెడ్డి, వంశీధర్ రెడ్డి, శ్రీరాములు, ఉమర్, అనిల్, నర్సంపల్లి నాగరాజు, తిరుపతి యాదవ్, సుదర్శన్, గోపి రెడ్డి, అప్సర్, జింక అజయ్ పాల్గొని విజయవంతం చేసారు.