గాంధీ జయంతి సందర్భంగా గ్రామసభ..

02-10-2026 | 10:24pm

తూప్రాన్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మెదక్ జిల్లా తూప్రాన్ మండలం వెంకటాయపల్లి గ్రామంలో గాంధీ జయంతి(Gandhi Jayanti) వేడుకలు గ్రామ సర్పంచ్ హరీష్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. అనంతరం విబిజి- రామ్ జీ గ్రామసభ కార్యక్రమాన్ని పంచాయతీ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామంలో నెలకొన్న ప్రతి సమస్యను పరిగణలోకి తీసుకొని సమస్య యొక్క పరిష్కార దిశగా ప్రతి ఒక్కరు సహకరించాలని గ్రామ సర్పంచ్ పేర్కొన్నారు. ఇందులో గ్రామ సెక్రటరీ, పాలకవర్గం సభ్యులు, గ్రామస్తులు, తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు