మహాత్మా గాంధీ ఆశయాలు
జడ్చర్ల,అక్టోబర్ 2: మహాత్మా గాంధీ గారి 157వ జయంతి సందర్భంగా జడ్చర్ల మండలం పరిధిలోని బూర్గుపల్లి గ్రామంలో(Burgupalli village) మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన బీసీ జాగృతి సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్, గ్రామ సర్పంచ్ శ్రీ ను గౌడ్, మాజీ సర్పంచ్,నరసింహారెడ్డి బీసీ జాబితా సేన రాష్ట్ర అధ్యక్షులు బూర్గుపల్లి కృష్ణ యాదవ్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింస, సామాజిక సమానత్వం, స్వచ్ఛత, గ్రామ స్వరాజ్యం వంటి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని పిలుపునిచ్చారు.
దేశ స్వాతంత్ర్యం కోసం గాంధీజీ సాగించిన అహింసా పోరాటం ప్రపంచ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిందని పేర్కొన్నారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు, గౌరవం లభించే సమాజ నిర్మాణమే గాంధీజీ కల అని అన్నారు. నేటి సమాజంలో పెరుగుతున్న అసమానతలు, వివక్ష, సామాజిక అన్యాయాలను తొలగించేందుకు గాంధీజీ ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని ప్రజలు ముందుకు సాగాలని కోరారు.
“గాంధీజీని స్మరించడం మాత్రమే కాదు.. ఆయన చూపిన సత్యం, అహింస, సామాజిక న్యాయం మార్గంలో నడవడమే ఆయనకు నిజమైన నివాళి” అని అన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ సర్పంచ్ నరసింహారెడ్డి, సర్పంచ్ శ్రీను గౌడు, కిషోర్ కుమార్,యాకోబు, రఘు రాములు, వార్డ్ మెంబర్, బొల్లె శేఖర్ కావలి శివకుమార్,నాగరాజు, విష్ణు,కావాలి సాయి, పవన్ కళ్యాణ్,బుచ్చయ్య, బొల్లె లక్ష్మయ్య, శ్రీకాంత్,శివానంద్ తదితరులు పాల్గొన్నారు.