ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా గంగిశంకర్
03-10-2026 | 10:43pm
ఘట్ కేసర్, అక్టోబర్ 3 (విజయక్రాంతి) : ఎదులాబాద్ డివిజన్ కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులుగా(Edulabad Division Congress SC Cell President) గంగి శంకర్(Gangi Shankar) నియమితులయ్యారు. ఈ మేరకు నియామకపు పత్రాన్ని మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రేష్ యాదవ్ శనివారం గంగి శంకర్ కు అందజేశారు. కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వేముల మహేష్ గౌడ్, పోచారం డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు కర్రె రాజేష్, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు వినోద్, నాయకులు మెడబోయిన జంగయ్య ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.