గజెల్లి మోహన్ కు డాక్టరేట్
బెల్లంపల్లి: బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రభుత్వ పాలన శాస్త్రం సబ్జెక్టులో కాంట్రాక్టర్ లెక్చరర్ గా పనిచేస్తున్న గజెల్లి మోహన్(Gazelli Mohan) డాక్టర్ రేట్ అవార్డు అందుకున్నారు. రాజస్థాన్లోని సన్రైస్ యూనివర్సిటీలో (Sunrise University)కొన్ని సంవత్సరాల క్రితం మోహన్ పిహెచ్డి చేస్తున్నారు. ఆ విశ్వవిద్యాలయంలోని పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ప్రొఫెసర్ యోగేంద్ర కుమార్ పర్యవేక్షణలో "పరిపాలన నైతికత పరిపాలన నిర్ణయీకరణలో నైతికత పాత్ర-పరిశీలన" అనే అంశంపై పరిశోధన చేశారు.
ఈ పరిశోధన గ్రంథాన్ని విశ్వవిద్యాలయానికి సమర్పించగా, ఈ పరిశోధనను డాక్టరేట్ కు ఎంపిక చేశారు. గురువారం రాజస్థాన్లోని సన్రైస్ యూనివర్సిటీలో ఎక్స్టర్నల్ ఎక్స్పర్ట్ డాక్టర్ గీతా యాదవ్ ఆధ్వర్యంలో ఓపెన్ వైవా నిర్వహించారు. మోహన్ వెల్లడించిన పరిశోధన అంశాలు సంతృప్తికరంగా ఉండడంతో ఆయనకు డాక్టరేట్ ప్రదానం చేశారు.
పీజీలో గోల్డ్ మెడల్
బెల్లంపల్లి పట్టణంలోని బాబు క్యాంప్ బస్తీకి చెందిన గజెల్లి బుచ్చమ్మ-రామయ్య (సింగరేణి రిటైర్డ్) దంపతులకు జన్మించిన మోహన్ బెల్లంపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో హై స్కూల్ ఇంటర్మీడియట్ చదివారు. డిగ్రీని వరంగల్ ఎల్బీ కళాశాలలో చదివారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ నిర్మల్ పీజీ సెంటర్లో ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ చదివి యూనివర్సిటీ సెకండ్ ర్యాంకు తో పాటు గోల్డ్ మెడల్ సాధించారు.
డిగ్రీ చదువుతున్నప్పటి నుండి సామాజిక సేవ చేయాలనే సంకల్పంతో మోహన్ అనేక సంక్షేమ కార్యక్రమాల్లో, సామాజిక సేవలో పాల్గొన్నారు. సామాజిక సేవా కార్యక్రమాలు చేసినందుకు గాను "బెస్ట్ యువజన అవార్డు", "బెస్ట్ సోషల్ సర్వీస్ అవార్డు", "రాష్ట్ర గవర్నర్ యాప్త అవార్డు", "బెస్ట్ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్ అవార్డ్", "బెస్ట్ బ్లడ్ డోనర్ అవార్డు" లతో పాటు జిల్లా, రాష్ట్ర స్థాయిలో అనేక సంస్థలచే అనేక అవార్డులను పొందారు.గజెల్లి మోహన్ కు అత్యున్నత డిగ్రీ పిహెచ్డి డాక్టరేట్ రావడం పై బెల్లంపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కాంపల్లి శంకర్ తో పాటు కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అధ్యాపకులు, హర్షం వ్యక్తం చేశారు.