21 August, 2026 | 1:27 AM

8వ రోజుకు చేరిన జెన్‌కో కార్మికుల నిరహార దీక్ష

21-08-2026 12:00 AM

చింతలపాలెం ఆగస్టు 20 : మండల పరిధి లోని పులిచింతల బ్యారేజి పవర్ ప్లాంట్లో 1620 ఏళ్లుగా పనిచేస్తున్న 12 మంది స్థానిక కార్మికులను పూర్తిస్థాయి ఆర్టిజన్ కార్మికులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఎనిమిదో రోజుకు చేరుకుంది. దీక్షా శిబిరాన్ని సందర్శించిన బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు కార్మికులకు సంపూర్ణ మద్దతు తెలిపారు.

హుజూర్ నగర్ నియోజకవర్గ బిఆర్‌ఎస్ సమన్వయకర్త ఒంటెద్దు నరసింహారెడ్డి మాట్లాడుతూ, ఏళ్లుగా సేవలందిస్తున్న కార్మికులను ఆర్టిజన్లుగా గుర్తించకుండా అవు ట్సోర్సింగ్ కార్మికులుగా మార్చడం అన్యాయమన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, జెన్కో సీ ఎండీ వెంటనే స్పందించి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ఎనిమిది రోజులుగా దీక్ష చేస్తున్న కార్మికుల ఆరోగ్యం క్షీణిస్తోందని, వారి ప్రాణాలకు ఏదైనా హాని జరిగితే ప్రభుత్వం, జెన్కో యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందని  బిఆర్‌ఎస్ మం డల మాజీ అధ్యక్షుడు మోర్తాల వెంకట రెడ్డి హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ నాయకులు కొప్పుల సైదిరెడ్డి, డాక్టర్ కేఎల్‌ఎన్ రెడ్డి, మోర్తాల వెంకట్ రెడ్డి, పోల్నేడి శ్రీనివాస్ రావు, కందుల రాంకోటి రెడ్డి, పెరుగు సుబ్బారావు, షేక్ మహబూబ్ అలీ తదితరులు పాల్గొన్నారు.