బొమ్మనపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
టేకులపల్లి, (విజయక్రాంతి): మండలంలోని బొమ్మనపల్లి(Bommanapalli)లో కాంగ్రెస్ పార్టీ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ 157వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఇల్లందు నియోజకవర్గ ఆత్మ కమిటీ డైరెక్టర్ బుర్ర ధర్మయ్యగౌడ్, బేతంపూడి సొసైటీ డైరెక్టర్ దోర్నాల విజయమోహన్‌రావు నాయకత్వంలో గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు యాసారపు నరసయ్యగౌడ్, నారందాసు నరసింహారావు, బుర్ర మోహన్రావుగౌడ్, దోర్నాల శ్రీనివాస్, ఆకుల వెంకటేశ్వరరావు, మొగలగాని రాజుగౌడ్, బండి శంకర్‌గౌడ్, యాసారపు జానయ్యగౌడ్, జి.కొత్తతండా ఉపసర్పంచ్ మాలోతు కుమార్నాయక్తో పాటు యువజన కాంగ్రెస్ నాయకులు కొండాల సంతోష్, యాసారపు సత్యసాయిగౌడ్, బుర్ర రంజిత్‌గౌడ్, చర్లపల్లి శివగౌడ్, బాలాజీనాయక్, వాంకుడోత్ సందీప్‌నాయక్, వాంకుడోత్ రాజేష్‌నాయక్, బుర్ర రాజమణికంఠ, పోశం ప్రసాద్ తదితరులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.