భూపాలపల్లి జిల్లా గణనాథుడికి సన్నిధిలో ఘనంగా కుంకుమ పూజలు
పూజా కార్యక్రమంలో పాల్గొన్న సూపరింటెండెంట్ వెంకటరత్నం,
భూపాలపల్లి, సెప్టెంబర్ 18 విజయ క్రాంతి: జిల్లా ప్రధాన ఆసుపత్రిలో (District Headquarters Hospital)ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద ఐదవ రోజు కుంకుమ పూజలు ఘనంగా నిర్వహించారు. గణపతి ఉత్సవ కమిటీ (Ganapati Utsav Committee)ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పూజా కార్యక్రమం భక్తిశ్రద్ధలతో, కోలాహలంగా సాగింది.ఈ కుంకుమ పూజ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ప్రధాన ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటరత్నం హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అనంతరం గణనాథుడికి కుంకుమార్చన చేసి, ఆసుపత్రి అభివృద్ధికి, రోగులందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రార్థించారు. మహిళలంతా సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని అమ్మవారిని తలపించేలా గణపతికి కుంకుమ పూజ చేశారు. పూజ అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో గణపతి ఉత్సవ కమిటీ సభ్యులు, వైద్యులు, నర్సులు, మహిళా సిబ్బంది పాల్గొన్నారు.