రుద్రంగి మండల కేంద్రం ఘనంగా వినాయక నిమజ్జన శోభయాత్ర
24-09-2026 | 03:43pm
రుద్రంగి సెప్టెంబర్ 24(విజయక్రాంతి) రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో(Rudrangi Mandal Headquarters) గురువారం వినాయక నిమజ్జన శోభాయాత్ర ఘనంగా సాగుతోంది. గ్రామంలోని పలు గణేష్ మండలిలల్లో తొమ్మిది రోజులు పూజలు అందకున్న నెలకొల్పిన వినాయకులు బుధవారం నిమజ్జనం లో వర్షం కారణంగా అంతరాయం కలగడంతో గురువారం ఉదయం నుండి గ్రామంలోని ప్రధాన వీధుల గుండా భారీ వినాయకుల శోభాయాత్ర కన్నుల పండగగా సాగుతుంది. భారీ వినాయకుల శోభాయాత్ర రాత్రి వరకు సాగి గ్రామంలోని బతుకమ్మ కుంటలో నిమజ్జనం చేయనున్నారు.ఎలాంటి అవాంఛనియా ఘటనలు జరగకుండా పోలీసులు తగు జాగ్రత్తలు తీసుకున్నారు.