రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపికైన గ్రీన్ వుడ్ పాఠశాల విద్యార్థిని.
మహదేవపూర్/కాళేశ్వరం,(విజయక్రాంతి): మండల కేంద్రం లోని గ్రీన్ వుడ్ పాఠశాల(Greenwood School)కు చెందిన 'జీడి జాగృతి' అనే విద్యార్థిని రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జయశంకర్ భూపాలపల్లిలో నిర్వహించిన జిల్లా స్థాయి సబ్ జూనియర్ కబడ్డీ పోటీల(District-level Sub-Junior Kabaddi competitions)లో జాగృతి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాజన్న సిరిసిల్ల(Rajanna Sircilla)లో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన సంధర్బంగా క్రీడాకారిణి జాగృతిని స్కూల్ కరస్పాండెంట్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి, ప్రిన్సిపాల్ చీర్ల శ్రీనివాస్ రెడ్డి , డైరెక్టర్ ఆకుతోట రాజ్ కుమార్ మరియు ఉపాధ్యాయ బృందం ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ మాట్లాడుతూ జాగృతి క్రమశిక్షణ నిరంతర శ్రమ మరియు క్రీడల పట్ల ఉన్న అంకితభావమే ఈ విజయాన్ని అందించాయని రాష్ట్ర స్థాయి పోటీలలో జాగృతి అద్భుత ప్రతిభ చాటి పాఠశాలకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తున్నామన్నారువిద్యార్థుల్లోని ప్రతిభను వెలికితీసి, వారిని అన్ని రంగాల్లో ముందుకు నడిపించడమే గ్రీన్ వుడ్ కాన్సెప్ట్ స్కూల్ యొక్క ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల వ్యాయామ ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు జాగృతికి అభినందనాలు తెలియజేశారు.