5 September, 2026 | 10:54 PM

పదవీ విరమణ పొందిన ఉత్తమ ఉపాధ్యాయునికి సన్మానం

05-09-2026 | 08:30pm

నేరేడుచర్ల,(విజయక్రాంతి): ఉత్తమ ఉపాధ్యాయ అవార్డ్(Best Teacher Award) గ్రహీత దిర్శించర్ల గ్రామానికి చెందిన చెన్నబోయిన క్రిష్ణయ్య ఉపాధ్యాయ వృత్తి నుంచి పదవీ విరమణ పొందిన సందర్భాన్ని పురస్కరించుకొని వారికి దిర్శించర్ల యాదవ్ యూత్ ఆధ్వర్యంలో శాలువా కప్పి, మెమెంటో అందించి సత్కరించడం జరిగింది. ఈ  కార్యక్రమంలో పార్థనబోయిన నాగరాజు,  పార్థనబోయిన విజయ్ కుమార్, చింతలచెరువు సతీష్, చెన్నబోయిన నవీన్, పగిడి శ్రీనివాస్, బుర్రి రాజు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు