వర్షానికి కులిన ఇల్లు.. తప్పిన ప్రమాదం

17-09-2026 | 10:01pm

రుద్రంగి సెప్టెంబర్ 17(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా(Rajanna Sircilla District) రుద్రంగి మండల కేంద్రంలో నిన్న కురిసిన భారీ వర్షానికి మంచే బుచ్చిలింగం అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలిపోయింది. ఇల్లు కులిన సమయంలో కుటుంబ సభ్యులు ఇంట్లో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది.

ఈ సందర్భంగా బుచ్చిలింగం మాట్లాడుతూ.తనకు ఉన్న ఒక్క ఆధారం ఇళ్లేనని ఇప్పుడు వర్షాల వల్ల ఉన్న ఒక్క ఇల్లు కూలిపోయిందని వృద్ధ దంపతులు ఆవేదన వ్యక్తంచేశారు.తనకు కొడుకులు లేరని ఒక్కతే కూతురని ఆస్తిపస్థులు భూములు కూడా ఎం లేవని ఉన్నది ఒక్కటే ఇళ్ళని మొన్నటి వరకు ఆలయంలో పని చేశానని పెరలసిస్ రావడంతో పని మనేసనని అన్నారు.ఉన్న ఒక్క ఇల్లు కూలి పోవడంతో గూడు చెదిరిందని రోదించాడు. ప్రభుత్వ పరంగా ఆదుకోవాలని అలాగే స్థానిక నాయకులు అధికారులు సహాయం అందించాలని వేడుకుంటున్నాడు.

మరిన్ని వార్తలు