యెమెన్‌లో మళ్లీ ఉద్రిక్తతలు
తుర్బాను స్వాధీనం చేసుకున్న హూతీలు
సనా, అక్టోబర్ 5: యెమెన్‌లో(Yemen) పరిస్థితులు రానురాను మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. స్థానిక ప్రభుత్వ దళాలకు(Government forces), ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులకు(Houthi rebels) మధ్య భీకర యుద్ధం(Fierce battle) తీవ్రరూపం దాల్చింది. హౌతీ తిరుగుబాటుదారులు కీలకమైన తుర్బా పట్టణాన్ని తమ నియంత్రణ లోకి తీసుకున్నారు. కాగా హూతీలపై స్థానిక ప్రభుత్వం పీఎల్సీ భారీ సైనిక చర్యను ప్రకటించడానికి కొద్దిసేపటి ముందే తూర్పా పట్టణాన్ని హౌతీలు స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు యెమెన్ ప్రభుత్వానికి మద్దతుగా ఉన్న సౌదీ అరేబియా నేతృత్వంలోని సంకీర్ణ దళాలు హూతీ తిరుగుబాటుదారులపై సైనిక చర్యలు కొనసాగిస్తున్నాయి.
కొన్ని రోజులుగా హూతీలు యెమెన్‌లోని మూడో అతిపెద్ద నగరమైన తైజ్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే హూతీలు తైజ్ శివార్లలోని పలు ప్రాంతాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేకాకుండా గత నెలలో మోఖా రేవు పట్టణం, బాబ్ ఎల్ మండెబ్ జలసంధి కూడా హూతీలు నియంత్రణ సాధించిన విషయం తెలిసిందే. ఇప్పటి వరకు ప్రభుత్వ బలగాలకు తుర్బా కీలక స్థావరం ఉంటూ వచ్చింది.యెమెన్ ప్రభుత్వానికి కేంద్రంగా ఉన్న ఏడెన్ నగరాన్ని తైజ్తో అనుసంధానించే ప్రధాన రహదారిపై తుర్బా పట్టణం ఉంది.దీంతో తైజ్‌ను హూతీల నుంచి కాపాడేందుకు ప్రయత్నిస్తున్న ప్రభుత్వ బలగాలకు తుర్బా కీలక స్థావరంగా ఉంటూ వచ్చింది.
హూతీల ఆధీనంలో ఉన్న ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడమే లక్ష్యంగా యెమెన్ ప్రభుత్వం ‘డాన్ ఆఫ్ యెమెన్’ పేరుతో ఆదివారం భారీ సైనిక చర్యను ప్రకటించింది.ఈ సైనిక చర్యలో భాగంగా బాబ్ ఎల్ మండెబ్ జలసంధిని తిరిగి తమ నియంత్రణలోకి తీసుకోవడంలో పైచేయి సాధించామని తాజాగా యెమెన్ ప్రభుత్వం ప్రకటించింది. అదే సమయంలో ధుబాబ్ అనే తీరప్రాంత పట్టణంతో పాటు, దానికి సమీపంలోని విమానాశ్రయాన్ని కూడా తిరిగి స్వాధీనం చేసుకున్నట్లు యెమెన్ ప్రభుత్వం పేర్కొంది.