ఏదులాబాద్ చెరువును సందర్శించిన హైడ్రా కమిషనర్

11-09-2026 | 05:15am

డంపింగ్ యార్డు వ్యర్థాలతో విషపూరితమవుతున్న చెరువును రక్షించాలని వినతి

ఘట్ కేసర్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : ఘట్ కేసర్ సర్కిల్, ఎదులాబాద్ డివిజన్ పరిధిలోని లక్ష్మీనారాయణ చెరువును హైడ్రా కమిషనర్ (HYDRA Commissioner) రంగనాథ్ గురు వారం ఉప్పల్ జోనల్ కమిషనర్ రాధిక గు ప్తా తో కలిసి సందర్శించారు.

లక్ష్మీనారాయ ణ చెరువు డంపింగ్ యార్డు వ్యర్థాల వల్ల తీ వ్రంగా కలుషితమవుతోందని, దీనిపై తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలని బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ చలవాడి ప్రవీణ్ రావు, మేడ్చల్ నియోజకవర్గ బీజేపీ ఇన్చార్జ్, ఘట్కేసర్ మండల మాజీ ఎంపీపీ ఏనుగు సుదర్శన్ రెడ్డి హైడ్రా కమిషనర్ రంగనాథ్ ని కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. కలుషిత నీటి వల్ల పంట పొలాలు నష్టపోతు న్నా యని, రైతులు చర్మ వ్యాధుల బారిన పడుతున్నారని వివరించారు.

అలాగే, పరిసర ప్రాంతాల ప్రజలు దుర్వాసన, దోమల బెడదతో తీవ్ర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటు న్నారని, తక్షణమే వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని కోరారు. డంపింగ్ వ్యర్థాలు రాకుండా ప్రహరీ గోడ నిర్మించాలని లేదా ప్రత్యామ్నాయ మార్గాలకు మళ్లించాలని కోరారు. చెరువు పరివాహక ప్రాంతంలో క బ్జాలకు గురైన స్థలాలను త్వరలోనే గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ రంగనాథ్ హామీ ఇచ్చారు.

అలాగే చెరువులోకి చేరుతున్న కలుషిత నీటిని శుద్ధి చే సేందుకు వీలుగా అధునాతన సేవేజ్ ట్రీ ట్మెంట్ ప్లాంట్, ఎఫ్లంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ లను ఏర్పాటు చేయడానికి తక్షణమే సమగ్ర నివేదిక సిద్ధం చేసి ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. ప్రభుత్వ ఆమోదం పొంది, పనులను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు శాయశక్తులా కృషి చేస్తామన్నారు.

మరిన్ని వార్తలు