సీఎంను కలిసిన టీజీఈజేఏసీ
ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని వినతి
హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణ ఉద్యోగుల జేఏసీ (టీజీ ఈజేఏసీ) చైర్మన్ వి లచ్చిరెడ్డి(Telangana Employees JAC Chairman V. Lachi Reddy), సెక్రటరీ జనరల్ ఒడ్నాల రాజశేఖర్ గురువారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి రాష్ట్రంలోని ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను సత్వరమే పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రాన్ని అందజేశారు. పీఆర్సీ, పెండింగ్ డీఏలు, సీపీఎస్ రద్దు ఓపీఎస్ పునరుద్ధరణతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయులకు సంబంధించిన ఇతర సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లారు.
సీఎం సానుకూలంగా స్పందించారని వారు చెప్పారు. ఈ అంశాలపై వచ్చే సోమవారం జరిగే సమావేశంలో సమగ్రంగా చర్చించి, పీఆర్సీ, డీఏ, సీపీఎస్ తదితర డిమాండ్ల అ మలుకు అవసరమైన చర్యలు తీసుకుంటా మని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. సీఎంను కలిసిన వారిలో టీజీటీఏ అధ్యక్షులు ఎస్ రాములు, ప్రధాన కార్యదర్శి పాక రమేష్, టీజీఆర్ఎస్ఏ అధ్యక్షుడు బాణాల రాంరెడ్డి, జీపీఓఏటీజీ గరికె ఉపేంద్రరావు ఉన్నారు.