ఉద్యోగులకు రూ.కోటి బీమా

11-09-2026 | 05:30am
  1. దేశంలోనే తొలిసారి తెలంగాణలో..
  2. పైసా ప్రీమియం లేకుండానే ఆర్థిక భరోసా
  3. బ్యాంకుల సహకారంతో అమలు
  4.    12.91 లక్షల మంది ఉద్యోగులు, పెన్షనర్లకు వర్తింపు
  5. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి) : ప్రభుత్వ ఉద్యోగులు(Government employees), కాంట్రాక్ట్(Contract), ఔట్‌సోర్సింగ్ సిబ్బంది(Outsourced staff), పెన్షనర్ల(Pensioners)కు కోటి రూ పాయల ప్రమాద బీమా(Accident Insurance) సౌకర్యం కల్పిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) వెల్లడించారు. దేశంలోనే తొలిసారిగా తెలంగా ణ అమలు చేస్తున్న ఈ పథకం.. ఉద్యోగి దురదృష్టవశాత్తు మరణిస్తే అతడి కుటుంబం రోడ్డున పడకుండా ఆర్థిక భరోసాగా నిలుస్తుందన్నారు. ప్రభుత్వం, ఉద్యోగులపై ఎలాంటి ఆర్థిక భారం లేకుండా బ్యాంకుల సహకారంతో పథకాన్ని అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.

గురువారం శాసనసభ ప్ర శ్నోత్తరాల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులకు ప్రమాద బీమా, హెల్త్ కార్డుల గురించి సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానమిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం 16 బ్యాంకులతో ఒప్పందం చేసుకుని రెగ్యులర్ ఉద్యోగులు, పెన్షనర్లు, కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ సిబ్బందికి బీమా కవరేజీ కల్పిస్తుందన్నారు. రాష్ట్రం లో మొత్తం 12,91,056 మంది ఈ పథకం పరిధిలో ఉన్నారని తెలిపారు. వీరిలో 5,18,293 మంది రెగ్యులర్, 5,00,158 మంది తాత్కాలిక, ఔట్ సోర్సింగ్, మల్టీపర్పస్ వర్కర్లు, కాంట్రాక్ట్, డైలీవేజ్, ఎన్‌ఆర్‌ఈ జీఎస్, ఎంటీఎస్, సెర్ప్ తదితర సిబ్బంది, 2,72,600 మంది పెన్షనర్లు, కుటుంబ పెన్షనర్లు ఉన్నారని వెల్లడించారు. 

బీమా పథకా నికి తొలుత సింగరేణి కాలరీస్, ఆ తరువాత విద్యుత్ శాఖ, అనంతరం రాష్ట్రంలోని ప్రభు త్వ ఉద్యోగులందరికీ వర్తించేలా విస్తరించినట్లు పేర్కొన్నారు. ఉ ద్యోగుల వేతనాలు జ మ కావడంతో వ్యాపారపరంగా లబ్ధి పొం దుతున్న బ్యాంకులు.. బీమా పథకానికి సహకరించేందుకు ముందుకు వచ్చి ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. ప్రభుత్వంపై, ఉద్యోగులపై ఎలాంటి ప్రీమియం భారం పడకుం డా పథకం అమలు జరుగుతుందన్నారు.

ఇప్పటికే క్లెయిమ్‌ల పరిష్కారం

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇప్పటివరకు 33 క్లెయిమ్‌లు వచ్చాయని, అందులో 24 క్లెయిమ్‌లను పరిష్కరించిన ట్లు డిప్యూటీ సీఎం భట్టి వెల్లడించారు. విద్యు త్ శాఖకు చెందిన ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్, టీజీ జెన్కో, ట్రాన్స్‌కో పరిధిలో 15 క్లెయిమ్‌లు రాగా అన్నింటినీ పరిష్కరించామని. రూ.15 కోట్లకు పైగా చెల్లింపులు చేసిన ట్లు వెల్లడించారు. సింగరేణిలో 50 క్లెయిమ్‌లకు గాను అన్నింటినీ పరిష్కరించినట్లు తెలిపారు. ప్రమాదవశాత్తు మరణించిన ఉ ద్యోగి కుటుంబానికి రూ.కోటి బీమాతో పా టు ఇతర ప్రయోజనాలు కలిపి రూ.1.20 కోట్ల వరకు ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

విమాన ప్రయాణ సమయంలో ప్రమాదం జరిగితే రూ.2 కోట్ల వరకు బీమా కల్పిస్తున్నట్లు వెల్లడించారు.  స హజ మరణానికి రూ.10 లక్షల వరకు ప్ర యోజనం కల్పించే వెసులుబాటు కూడా ఉన్నట్లు తెలిపారు.  తెలంగాణలో ప్రారంభించిన ప్రమాద బీమా పథకాన్ని కేంద్ర ప్ర భుత్వం కూడా అధ్యయనం చేసిందని, ఇతర రాష్ట్రాలు సైతం ఆసక్తి చూపుతున్నాయన్నారు.

ఇప్పటికే ఈ తరహా స్కీంతోపాటు ప్రభు త్వ ఉద్యోగులు, పెన్షనర్ల కోసం హెల్త్‌కార్డు పథకాన్ని తమిళనాడు సర్కార్ అమల్లోకి తెచ్చిందని పేర్కొన్నారు.  కార్పొరేట్ ఆస్పత్రు ల్లో నగదురహిత సేవలందిస్తూ ప్రభుత్వ ఉ ద్యోగుల కలను ప్రభుత్వం సాకారం చేసిందన్నారు.హెల్త్‌కార్డు స్కీంకోసం ఇప్పటికే రూ. 240 కోట్ల కేటాయించినట్లు భట్టి వెల్లడించారు. ఉద్యోగుల కుటుంబాలకు ఆర్థిక, వైద్య భరోసా కల్పించేలా హెల్త్‌కార్డు, బీమా పథకాలను రూపొందించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు