మగవాళ్లకూ పీరియడ్స్ రావాలని మొక్కుకున్నా!
కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రుతి హాసన్(Kollywood star heroine Shruti Haasan) ఓ వైపు నటిగా రాణిస్తూనే.. సింగర్‌గానూ పలు చిత్రాల్లో పాటలు పాడుతూ, వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమాలతో ఇంత బిజీగా ఉన్న శ్రుతి హాసన్ తాజాగా ఓ పాడ్‌కాస్ట్(Podcast)లో పాల్గొంది. ఈ సందర్భంగా పీరియడ్స్(Periods) సమయంలో వచ్చే తీవ్రమైన నొప్పులు, వాటి గురించి సమాజంలో ఉండే అపోహలపై శ్రుతి హాసన్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. “నాకు పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్(Polycystic Ovary Syndrome) సమస్య ఉంది. ఈ కారణంగా పీరియడ్స్ టైమ్‌లో నేను చాలా బాధ అనుభవిస్తా.
నా సినీ కెరీర్ ఆరంభంలో ఈ విషయాల గురించి మాట్లాడేందుకు కొంచెం మొహమాటపడేదాన్ని. దీని గురించి ఎవరూ పెద్దగా చర్చించరని భావించేదాన్ని. కానీ తోటి నటులు తమ మోకాలి సర్జరీ వంటి సమస్యల గురించి చెప్పినప్పుడు డైరెక్టర్లు సెట్స్‌లో సర్దుబాటు చేసేవారు. నేను మాత్రం పీరియడ్స్ గురించి చెప్పడానికి సంకోచించేదాన్ని. మగవాళ్లకు కూడా పీరియడ్స్ వస్తే బాగుంటుంది. అప్పుడు ఆటోమేటిక్‌గా వర్క్ కాంట్రాక్టుల్లో పీరియడ్ సెలవులు కూడా వచ్చి ఉండేవి కదా అని నేను అనుకునేదాన్ని.
అంతేకాకుండా పురుషులకు కూడా నెలసరి రావాలి.. అప్పుడే మహిళలు పడే బాధ వాళ్లకు తెలుస్తుందని నేను దాదాపు వెయ్యి సార్లు దేవుడిని ప్రార్థించి ఉంటా. అయితే ఒకసారి నేను పీరియడ్ విషయం చెప్పినప్పుడు, ఆ దర్శకుడికి కూతురు ఉండటంతో ఆ కష్టాన్ని అర్థం చేసుకుని నాకు పూర్తి సహకారం అందించారు. ఆ సంఘటన తర్వాతే నా ఆలోచనా విధానంలో మార్పు వచ్చింది” తెలిపిందీ ముద్దుగుమ్మ. శ్రుతి ప్రస్తుతం విజయ్ సేతుపతితో కలిసి ‘ట్రెయిన్’, దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఆకాశంలో ఒక తార’ సినిమాల్లో నటిస్తోంది.