కడెం నదిలో ఇసుక తోడేళ్లు
ఇసుక డంపు చేసేందుకు గుత్తేదారు ఎత్తులు.
బోథ్,(విజయక్రాంతి): సయాద్రి పర్వత శ్రేణుల నుండి ఉరకలు వేస్తూ వస్తున్న కడెం నది(Kadem River)లో ఇసుక దొంగలు పడుతున్నారు. ఒకవైపు ఎల్ నినో ప్రభావం వల్ల వేసవికాలం నీటి ఎద్దడి తప్పదని అధికారులు ఇప్పటినుండే ప్రజలను చైతన్యం చేస్తుంటే నేరడిగొండ మండలంలోని కుట్టి, కుమారి గ్రామాల మధ్యన ఉన్న కడెం నది నుండి తీసుకొని అక్రమంగా తరలించకపోతున్నారు.
దీంతో భవిష్యత్తులో నీటి ఎద్దడి మరింత తీవ్రమవుతుందని ఆయా గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తపరుస్తున్నారు. వాస్తవానికి ఇసుక అక్రమ రవాణా(Illegal Sand Mining)పై అధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్న ఓ గుత్తేదారు మాత్రం పట్టపగలే దర్జాగా జెసిపి ద్వారా ట్రాక్టర్లలో తీసుకొని తరలించారు. అయితే విషయం గమనించిన కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో ట్రాక్టర్ జెసిపిలను నేరడిగొండ పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు తెలిసింది.