గాలి మోటర్ లో గణనాధుని నిమజ్జనం..

19-09-2026 | 12:21am

* జిల్లాకు ఎయిర్ పోర్ట్ మంజూరుతో బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం...

ఆదిలాబాద్, సెప్టెంబర్ 18, (విజయక్రాంతి): ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంప్(Adilabad MLA Camp Office) కార్యాలయ ఆవరణలో ప్రతిష్టించిన గణనాథుడి నిమజ్జన కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఆదిలాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతిష్టించిన వినాయకుని నిమజ్జనం వైభవంగా జరిగింది.

ఇటీవల జిల్లాకు ఎయిర్పోర్ట్ మంజూరు కావడాన్నీ హర్షిస్తూ  ప్రధాని మోడీ, ఎమ్మెల్యే పాయల్ శంకర్ లకు కృతజ్ఞతలు తెలియజేస్తూ కటౌట్ లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి, విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీ గోడం నగేష్, కలెక్టర్ రాజర్షిషా ఫోటోలను ఏర్పాటు చేశారు. విమానంపై గణేష్ నిమజ్జనం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేసిన విమానం నమూనా పై గణేష్ విగ్రహాన్ని ఉంచి నిమజ్జన శోభాయాత్ర చేపట్టారు.

మరిన్ని వార్తలు