భారత్, అమెరికా మధ్య ట్రేడ్ డీల్లో స్తబ్ధత
- ఇరుదేశాలు రాయితీలు పొందడం అసాధ్యమే
- టారిఫ్లను అమెరికా ఆయుధంలా వాడుకుంటున్నది
- కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, అక్టోబర్ 5: కొన్ని నెలలుగా భారత్, అమెరికా(India, America) మధ్య కొనసాగుతున్న ట్రేడ్ డీల్ చర్చల్లో(Trade deal discussion) స్తబ్ధత కనిపిస్తున్నదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) అన్నారు. ఇరు దేశాలు పరస్పరం మరిన్ని రాయితీలు పొందడం దాదాపు అసాధ్యమే అన్నట్లుగా పరిస్థితి ఉందని అభిప్రాయపడ్డారు. ఇంకా సంప్రదింపులు జరుగు తున్న ప్పటికీ, చర్చల్లో పెద్దగా పురోగతి లేదని చె ప్పారు. సోమవారం ఢిల్లీలో జరిగిన బిజినెస్ లీడర్స్ సదస్సులో(Business Leaders Conference) నిర్మలా సీతారామన్ మాట్లాడారు.
‘ట్రేడ్ డీల్ కోసం ఇంకా సంప్రదింపులు జరుగుతున్నా.. పీటముడి పడి నట్లు అనిపిస్తున్నది. చర్చల్లో పురోగతి లేదనిపిస్తున్నది. అయితే.. ఇంతటితో సంప్రదిం పులు ఆగిపోవు.. కొనసా గుతాయి. దేశ ప్ర యోజనాలే మా ప్రభుత్వానికి ముఖ్యం’ అని తెలిపారు. చర్చలతో పరిష్కరించుకోకుండా, టారిఫ్లను ఆయుధంగా వాడుకో వాలని అమెరికా చూస్తున్న దని ఆమె అన్నారు.