సినీఫక్కీలో డ్రగ్స్ బోట్ ఛేజ్

30-09-2026 | 12:30pm

లక్షద్వీప్ సమీపంలోని అరేబియా సముద్రంలో భారీ డ్రగ్స్ అక్రమ రవాణాను ఇండియన్ కోస్ట్ గార్డ్(Indian Coast Guard), ఏటీఎస్(ATS) అధికారులు అడ్డుకున్నారు. సినీ ఫక్కీలో ఇరాన్‌కు చెందిన ఓ పడవను ఛేజ్ చేసి తనిఖీ చేయగా, అందులో భారీగా మత్తు పదార్థాలు గుర్తించారు. సుమారు 526 కిలోల మెథాంఫెటమైన్, హెరాయిన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.3,000 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

డ్రగ్స్‌తో పాటు పడవను కూడా అధికారులు స్వాధీనం చేసుకుని ముంబయికి తరలించారు. పడవలో ఉన్న ఐదుగురు పాకిస్థానీ నావికులను అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో వీరికి ఉన్న సంబంధాలు, డ్రగ్స్ ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎక్కడికి చేరవేయాల్సి ఉందనే అంశాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ భారీ డ్రగ్స్ పట్టివేతతో సముద్రమార్గంలో జరుగుతున్న అక్రమ రవాణాపై భద్రతా సంస్థలు మరింత అప్రమత్తమయ్యాయి.

మరిన్ని వార్తలు