అమన్ పసిడి పట్టు

04-10-2026 | 05:25am

సత్తా చాటిన రెజ్లర్లు

నగోయా, అక్టోబర్ 3 : ఆసియా క్రీడల(Asian Games) చివరి రోజు భారత రెజ్లర్లు సత్తా చాటారు. పురుషుల విభాగంలో అమన్ సెహ్రావత్ ప సిడి పతకం సాధించాడు. అమన్ దెబ్బకు ఉత్తర కొరియా ఆటగాడు, వరల్ ఛాంపియ న్ చాంగ్ సాంగ్ హాన్ చేతులెత్తేశాడు. పురుషుల 57 కేజీల విభాగంలో 11- తేడాతో అమన్ గెలిచాడు. పురుషుల 97కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్లో సత్తా చాటిన దీపక్ పూనియా చరిత్రాత్మక కాంస్యం ముద్దాడాడు.

తద్వారా ఈ విభాగంలో 60 ఏళ్ల పతక నిరీక్షణకు తెరదించాడు. కాసేపటికే మహిళా రెజ్లర్ అంతి మ్ పంఘాల్ వెండి పతకం సాధించింది. 53 కిలోల ఫైనల్లో జోరు చూపించలేక, ప్రత్యర్థి అయిన జపాన్ రెజ్లర్ను పడగొట్టలేక సిల్వర్ మెడల్తో సరిపెట్టుకుంది. ఆసియాడ్లో అంతిమ్‌కు ఇది రెండో పతకం.


మరిన్ని వార్తలు