ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్
ఫ్లైట్ బుక్ చేసే ముందు ఇది చూడండి.. ఇండిగో ఛార్జీల్లో మార్పు!
న్యూఢిల్లీ, అక్టోబర్ 5 (విజయక్రాంతి): విమాన ప్రయాణం ప్లాన్ చేస్తున్న వారికి ఇండిగో (IndiGo) కీలక అప్‌డేట్ ఇచ్చింది. పెరుగుతున్న Aviation Turbine Fuel (ATF) ధరల నేపథ్యంలో దేశీయ, అంతర్జాతీయ విమానాలపై Fuel Surcharge పెంచుతున్నట్లు ప్రకటించింది. సవరించిన ఛార్జీలు అక్టోబర్ 6 నుంచి అమల్లోకి రానున్నాయి. దీంతో ఇండిగోలో ప్రయాణించే వారికి టికెట్ ధరపై అదనపు భారం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా Domestic Flight Ticket Pricesపై దూరాన్ని బట్టి సర్‌చార్జ్ పెరగనుంది. ఇండిగో ప్రకటించిన కొత్త Fuel Surcharge దేశీయ విమానాలకు దూరాన్ని బట్టి మారుతుంది. ఒక్కో ప్రయాణంపై కనీసం రూ.100 నుంచి గరిష్ఠంగా రూ.350 వరకు అదనపు ఛార్జీ విధించనుంది. అంటే తక్కువ దూరం ప్రయాణించే వారికి ఒక స్థాయి ఛార్జీ ఉండగా.. ఎక్కువ దూరం ప్రయాణించే వారికి సర్‌చార్జ్ మరింత ఎక్కువగా ఉండనుంది. దీంతో IndiGo Flight Ticket Priceలో కూడా మార్పు కనిపించనుంది.
ఇంటర్నేషనల్ ఫ్లైట్స్‌పైనా ప్రభావం
కేవలం దేశీయ విమానాలకే పరిమితం కాకుండా International Flight Ticketsపైనా ఫ్యూయల్ సర్‌చార్జ్ పెంపు అమలు చేయనున్నట్లు ఇండిగో తెలిపింది. విమాన ఇంధన ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎయిర్‌లైన్ పేర్కొంది. ఫలితంగా దేశీయ, అంతర్జాతీయ ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకునే సమయంలో అదనపు ఛార్జీలను ఎదుర్కోవాల్సి రావచ్చు. విమానయాన సంస్థల నిర్వహణ ఖర్చుల్లో Jet Fuel / ATF Prices కీలక పాత్ర పోషిస్తాయి. ఇంధన ధరల్లో పెరుగుదల నేరుగా విమాన నిర్వహణ వ్యయాలపై ప్రభావం చూపుతుంది. ఈ నేపథ్యంలోనే పెరుగుతున్న ఇంధన వ్యయాన్ని దృష్టిలో పెట్టుకుని IndiGo Fuel Surcharge Hike నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అక్టోబర్ 6 నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రావడంతో కొత్తగా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులపై దీని ప్రభావం కనిపించనుంది.
టికెట్ బుక్ చేసుకునే ముందు ఇది చూడండి!
ఇండిగోలో దేశీయ లేదా అంతర్జాతీయ ప్రయాణం చేయాలని ప్లాన్ చేస్తున్నవారు ఇకపై Flight Fare, Fuel Surcharge, Total Ticket Priceలను పరిశీలించి బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మొత్తంగా పెరుగుతున్న Jet Fuel Prices కారణంగా ఇండిగో తీసుకున్న ఈ నిర్ణయం విమాన ప్రయాణ ఖర్చులను మరోసారి చర్చలోకి తెచ్చింది. అక్టోబర్ 6 నుంచి అమల్లోకి వచ్చే కొత్త ఛార్జీలతో ప్రయాణికులపై ఎంత మేర ప్రభావం పడుతుందనేది చూడాలి.