స్వచ్ఛతకు బాట

05-10-2026 | 03:03pm

కోనాయిపల్లిలో చెత్తబుట్టల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం

తూప్రాన్,(విజయ క్రాంతి): మెదక్ జిల్లా(Medak district) తూప్రాన్ మండలం కొనాయిపల్లి పిబి శనివారం నుండి చెట్టబుట్టల కార్యక్రమం(Distribution of garbage bins) కొనసాగింది. ఎంపీడీవో శాళిక వారి చేతుల మీదుగా పంపిణీ చేయడం జరిగింది. ఇదే క్రమంలో సోమవారం రోజున మిగిలివున్న చెత్త బట్టలు(Garbage bins) గ్రామస్తులకు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కంకణాల నాగమణి మాట్లాడుతూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా అందించిన చెత్త బుట్టలో వేసి గ్రామ పంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరినారు. ఇందులో గ్రామ సెక్రెటరీ సతీష్ కుమార్, ఉప సర్పంచ్, రామ పాలక వర్గం సభ్యులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు