5 September, 2026 | 8:37 PM

రూ.5.02 కోట్లతో సమీకృత మార్కెట్ ప్రారంభం

05-09-2026 | 06:45pm

ప్రజల సౌకర్యమే లక్ష్యం: ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబ్‌నగర్ సెప్టెంబర్(విజయక్రాంతి): నగర ప్రజలు, వ్యాపారులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా మార్కెట్లను అభివృద్ధి చేస్తున్నామని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్ రెడ్డి(Yennam Srinivas Reddy) అన్నారు. 58వ డివిజన్‌లో రూ.5.02 కోట్లతో నిర్మించిన అధునాతన వెజ్–నాన్ వెజ్ సమీకృత మార్కెట్‌(Integrated Non Veg Market)ను ఆయన ప్రారంభించారు.

మార్కెట్‌లో వ్యాపారులకు మంచినీటి ప్లాంట్, రిఫ్రిజిరేటర్ తదితర సౌకర్యాలు ఏర్పాటు చేశామని, త్వరలో టాయిలెట్లు, విశ్రాంతి గదులు కూడా కల్పిస్తామని తెలిపారు. తైబజార్ రద్దుతో చిన్న వ్యాపారులపై ఆర్థిక భారం తగ్గిందన్నారు. రోడ్లపై వ్యాపారాలు నిర్వహించకుండా మార్కెట్‌లోనే వ్యాపారం చేసుకోవాలని సూచించారు. ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి రోడ్ల విస్తరణ, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఫ్లైఓవర్ వంటి పనులు చేపడుతున్నామని చెప్పారు.

ఈ కార్యక్రమంలో మేయర్ గుమ్మాల మమత శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ మారేపల్లి సురేందర్ రెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఎన్.పి. వెంకటేష్, సిరాజ్ ఖాద్రీ, 58వ డివిజన్ కార్పొరేటర్ ఎం. అనురాధ చిన్న, మున్సిపల్ కమిషనర్ రామాంజుల రెడ్డి, పలువురు కార్పొరేటర్లు, నాయకులు పాల్గొన్నారు

మరిన్ని వార్తలు