రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఐపీఎస్ విద్యార్థి అక్షిత్
సుల్తానాబాద్,(విజయక్రాంతి): పెద్దపల్లి జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సుల్తానాబాద్ ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో ఇండియన్ పబ్లిక్ పాఠశాల (ఐపీఎస్) విద్యార్థి ఎం. అక్షిత్‌కుమార్ ప్రతిభ కనబరిచాడు. అండర్-16 బాలుర లాంగ్‌జంప్ విభాగంలో సిల్వర్ మెడల్ సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు అర్హత సాధించాడు. ఈ నెల 26, 27 తేదీల్లో హనుమకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో అక్షిత్ కుమార్ పాల్గొననున్నాడు.
విద్యార్థి ప్రతిభ పై పాఠశాల చైర్మన్ మాటేటి సంజీవ్‌కుమార్, ప్రిన్సిపాల్ కృష్ణప్రియ హర్షం వ్యక్తం చేసి అభినందించారు. రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ రాణించి పాఠశాలకు, సుల్తానాబాద్‌కు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థికి శిక్షణ అందించిన కోచ్ సత్యంను అభినందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ సునీత, మేనేజర్ శివ, పీఈటీలు సతీష్, జ్యోతి తదితరులు పాల్గొన్నారు.






