ఇస్కాన్ టెంపుల్ డ్రైనేజీ సమస్యను పరిష్కరిస్తాం
ముకరంపుర, అక్టోబర్ 5 (విజయక్రాంతి): కరీంనగర్ అల్కాపురి కాలనీ బైపాస్ రోడ్డులో గల శ్రీ రాధా గోవింద మందిరం ఇస్కాన్ టెంపుల్ బాధ్యుల పిలుపు మేరకు నగర మేయర్ కొలగాని శ్రీనివాస్, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు(Deputy Mayor Yadagiri Sunil Rao) ఆలయ దర్శనం చేసుకుని శ్రీ రాధా గోవింద స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఆలయ సందర్శన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి ఇస్కాన్ బాధ్యులు ఆలయ పరిసరాలలో ఎదురవుతున్న పలు సమస్యలను వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఆలయ సమీపంలో పేరుకుపోతున్న డ్రైనేజీ నీటికి సంబంధించిన సమస్యను, దాని వల్ల ఆలయ నిర్వహణకు అలాగే నిత్యం ఆలయానికి వచ్చే భక్తులకు కలుగుతున్న ఇబ్బందులను వారికి వివరించారు.
ఈ సమస్యపై తక్షణమే స్పందించి ఆలయ పరిసరాల్లో డ్రైనేజీ నీటి సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తగిన చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ పడిశెట్టి వసంత లక్ష్మీ- భూమయ్య, ఇస్కాన్ ఆలయ బాధ్యులు ప్రభుజీ, డాక్టర్ రాజభాస్కర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ తుమ్మల రమేష్ రెడ్డి, కో-ఆప్షన్ సభ్యులు కన్న కృష్ణ, కెప్టెన్ మధుసూదన్ రెడ్డి, వెంకటేష్, తదితర నాయకులు, ఆలయ ప్రతినిధులు పాల్గొన్నారు.