కుష్ఠు రహిత జిల్లాగా మార్చాలి

18-09-2026 | 11:29pm

కాగజ్‌నగర్ (విజయక్రాంతి): జిల్లాను కుష్ఠు(leprosy) రహిత జిల్లాగా మార్చే లక్ష్యంతో అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డా. నాగేంద్ర ఆదేశించారు. శుక్రవారం కాగజ్‌నగర్‌లో జిల్లా వైద్యాధికారులు, పీహెచ్‌సీల ఎన్ ఎల్ ఈపి నోడల్‌ పర్సన్‌లకు జాతీయ కుష్ఠునివారణ కార్యక్రమంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఎన్ ఎల్ ఈ పి జాయింట్ డైరెక్టర్, స్టేట్ లెప్రసీ ప్రోగ్రాం ఆఫీసర్ డా. జాన్‌బాబు(State Leprosy Program Officer Dr. John Babu) కుష్ఠు వ్యాధిగ్రస్తులను గుర్తించడం, చికిత్స అందించడం, ముందస్తు జాగ్రత్తలు, రికార్డుల నిర్వహణ, వ్యాధి నివారణ చర్యలపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అనంతరం డా. నాగేంద్ర మాట్లాడుతూ కుష్ఠు కేసులను పూర్తిగా నిర్మూలించేందుకు క్షేత్రస్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వ్యాధి నివారణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మరిన్ని వార్తలు