మహనీయుల పుట్టినరోజులు ఒకేరోజు రావడం ముదా భావం

02-10-2026 | 10:05pm

మేడ్చల్ నియోజకవర్గ ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అద్యక్షుడు క్రాంతికుమార్ 

జవహర్ నగర్, అక్టోబర్ 2 (విజయక్రాంతి): మహనీయుల పుట్టినరోజు వేడుకలు ఒకేరోజు జరుపుకోవడం ముదాభావమని కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం ఎస్సీ సెల్ ఏ బ్లాక్ అద్యక్షుడు మాట్ల క్రాంతి కుమార్(Matla Kranthi Kumar) పేర్కొన్నారు. మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కీసర సర్కిల్ జవహర్ నగర్ పరిధిలోని నాచారం ఫైర్ విక్టిమ్ కాలనీలో ప్రపంచానికి అహింసా సిద్ధాంతాన్ని అందించిన మహనీయుడు జాతికిత మహాత్మా గాంధీ, జై జవాన్ జై కిసాన్ నినాదంతో దేశ రక్షణకు రైతన్న సంక్షేమానికి బాటలు వేసిన మాజీ ప్రధాని లాల్ బహుదూర్ శాస్త్రి జయంతి వేడుకలు ఒకేరోజు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ జాతిపిత మహాత్మా గాంధీ, జాతి నేత లాల్ బహుదూర్ శాస్త్రి దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయమని వారి పేర్లను బావి తరాలు గుర్తుంచుకుంటాయన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా జవహర్ నగర్ యువత ముందుకు సాగాలన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ శాంతి కోటేష్ గౌడ్, మాజీ కార్పొరేటర్లు మనోధర్ రెడ్డి, బల్లి శ్రీనివాస్ గుప్తా, అశోక్ గుప్తాలు ఎర్ర గుడ్ల వెంకటేశ్వర్లు, నాయకం భాస్కర్, కోటేష్ గౌడ్, సోమాచారి, గజ్వేల్ శంకర్, కాలేశా, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు