టీమిండియాకు జెర్సీ కష్టాలు
ముంబై, సెప్టెంబర్ 19 : ఆసియా క్రీడలకు(Asian Games) సిద్ధమైన భారత పురుషుల క్రికెట్ జట్టు(Indian mens cricket team)కు జెర్సీ(Jersey) కష్టాలు వెంటాడుతున్నాయి. ఆదివా రం జపాన్‌కు బయలుదేరుతుండగా టీమిండియాకు ఇంకా పూర్తి కిట్ అందలేదు. ము ఖ్యంగా ఆటగాళ్ల జెర్సీ సైజుల విషయంలో ఇబ్బందులు తలెత్తినట్టు సమాచారం. ఆసియా క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు ఐవోఏనే జెర్సీ కిట్‌ను అందిస్తుంది. భారత ఒలింపిక్ సంఘం తరపున ఆ జెర్సీతోనే భారత క్రికెటర్లు బరిలోకి దిగాల్సి ఉంటుంది.
అయితే జెర్సీల సైజులకు సంబంధించి ఆటగాళ్లకు సమస్యలు ఎదురైనట్టు గుర్తించారు. దీంతో కిట్ స్పాన్సర్ జేఎస్‌డబ్ల్యూ(Kit sponsor JSW)తో బీసీసీఐ, ఐవోఏ సంప్రదింపులు జరుపుతోంది. వీలైనంత త్వరగా సమస్యను పరిష్కారించాలని కోరుతున్నాయి. కాగా ఆసియాక్రీడల కంటే ముందు భారత జట్టు జపాన్‌తో ఏకైక టీ20 మ్యాచ్ ఆడనుంది. ఈ మ్యాచ్‌లో టీ మిండియా రెగ్యులర్‌గా ధరించే బ్లూ జెర్సీతోనే బరిలోకి దిగుతుంది.